ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory…
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory issues) బాధపడుతున్నారు.అక్టోబరు 31న అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గతంలో రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్యం నిలకడగా ఉందని హేమ మాలిని, సన్నీ డియోల్ తెలిపినప్పటికీ.. నేడు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.
హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా…
టెన్త్ 50 వేలు, ఇంటర్ 75 వేలు, డిగ్రీ 1.20 వేలు.. బిటేక్ ఫేక్ సర్టిఫికెట్స్.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో… నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిమితిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్…
హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన…
రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరార్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన విజయవాడకు చెందిన యువతి సంబంధం యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న వరుడు గతంలో మరో ఇద్దరు యువకులను సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తింపు.
కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీవిశాఖపట్టణం-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్ 20 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు జీఆర్పీకి ఫిర్యాదు చేశారు. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. కాజీపేటకు రాగానే చోరీ విషయం గుర్తించారు. కాచిగూడలో చేసిన ఫిర్యాదు కాజీపేట జీఆర్పీకి బదిలీ అయిందని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో ఏపీకే ఫైల్ స్కామ్ కలకలం రేపుతోంది. ‘కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవుతుంది’ అంటూ టీం ఎస్బీఐ పేరుతో వందల వాట్సాప్ గ్రూపులకు నకిలీ సందేశాలు పంపించారు. లింక్‌ను నొక్కిన వెంటనే బాధితుల ఫోన్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లి, అదే సందేశం ఆటోమేటిక్‌గా ఇతర గ్రూపులకు పంపబడుతోంది. ఆదివారం అధికారులు, మీడియా, విద్యార్థుల గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి. ఫోన్ల డేటా నేరగాళ్లకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలువురు పోలీసులకు, 1930…
హైదరాబాద్ – శామీర్‌పేట్ సమీపంలో ఓఆర్అర్‌పై ఎకో స్పోర్ట్ కారులో చెలరేగిన మంటలు, తప్పించుకునేందుకు అవకాశం లేక కారులోనే సజీవదహనమైన డ్రైవర్.
ఢిల్లీ: 24 నవంబర్, 53వ CJI గా జస్టీస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. Feb 9 2027 వరకు ఆయన ఈ పదవి లో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్: హిసార్ గ్రామం నుంచి దేశ అత్యున్నత న్యాయ స్థానం వరకూ చేసిన ప్రస్థానం ఈ కథనంలో తెలుసుకుందాం. భారత న్యాయవ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన స్థానమైన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పదవికి చేపట్టిన జస్టిస్…
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవలె జరిగిన బదిలీల్లో భాగంగా స్థానిక ఎస్పీ కిరణ్ ఖరే హైదరాబాద్ సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో గవర్నర్ ఏడిసి లో పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ బాధ్యతలు చేపట్టారు.