గెలుపు పొందే వరకు… అలుపు లేదు మనకు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి మూడవ ర్యాంక్ తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగం సాధించిన రామగుండం న్యాయవాది, అర్థ కుమార్.

పెద్దపల్లి జిల్లా ఆంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన అర్ధ చంద్రయ్య , వరలక్ష్మీ దంపతుల రెండవ కుమారుడు అర్ధ కుమార్ చిన్నప్పటి నుండి… స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబా సాహెబ్ అంబెద్కర్ ను ఆదర్శంగా తీసుకొని… తన చుట్టూ ఉన్న పేద ప్రజలకు ఏదో ఒక సాయం చేయాలని పరితపించేవాడు.

ఇదే క్రమంలో 2004 లో కాకతీయ విశ్వ విద్యాలయం నుండి న్యాయవాది విద్యను పూర్తి చేసి పలువురు సీనియర్ న్యాయవాదుల వద్ద మెలకువలు నేర్చుకున్నారు. పేద ప్రజలకు మరింత విస్తృతంగా ఉచితంగా న్యాయ సహాయం చేయాలని బలమైన కోరికతో మొదటిసారి 2012 లో ఏ పి పి పరీక్ష రాసి పోస్టులు తక్కువ ఉండడం కారణంగా తృటిలో ఉద్యోగం చేజారిపోయింది.

అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహానికి గురికాకుండా.. తిరిగి 2021 అక్టోబర్ లో మరోసారి ఏ పి పి నియమక పరీక్ష రాసి తెలంగాణ రాష్ట్ర స్థాయి టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా అర్ధ కుమార్ తన నేపద్యాన్ని వివరిస్తూ… నా ప్రాథమిక విద్యను రామగుండం, ఇంటర్, డిగ్రీని గోదావరిఖని లో పూర్తి చేశానని, చిన్న తనం నుండి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి, స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో 7 వ తరగతి నుండే కష్టపడి పనిచేశానని, డిగ్రీలో వివిధ ఆఫీసులలో క్లర్క్ గా, తర్వాత కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేశానని.. పేద ప్రజలకు న్యాయ సహాయం చేయాలనే నా జీవిత ఆశయం.. ఏ పి పి కి ఎంపిక కావడం వల్ల నెరవేరనుందని, తెలిపారు.

నేటి యువత ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని, లక్ష్యం సాధించాలనే.. దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తే ఎంతటి ఉన్నత లక్ష్యం అయిన సాధించవచ్చని, తను విజయం సాధించడంలో భార్య రజిత, తల్లి వరలక్ష్మి, బావ పల్లె శంకర్,

సోదరులు అంబీర్ శ్రీనివాస్ పటేల్, అర్థ శ్రీనివాస్ పటేల్, ఇంకా మేన అల్లుళ్ళు, మిత్రుడు రాజేందర్ అందించిన తోడ్పాటు మరువలేనిదని పేర్కొన్నారు.