శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు!

image 1668747644

హైదరాబాద్:నవంబర్ 19
మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో సోమ, మంగళ వారాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయిం ది, పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది..,

దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శబరిమలలో రెండు నెలల పాటు జరిగే మండల- మకర విళక్కు యాత్రా సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది. విపరీత మైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యం తో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

మంగళవారం, బుధవారం నాడు రద్దీని నియంత్రించేం దుకు దర్శన సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిం చాలని నిర్ణయించినప్పటికీ, సోమవారం నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోలేదు.

స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 నుంచి 15 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. పవిత్రమైన 18 మెట్ల వద్ద భక్తుల ప్రవాహం గణనీ యంగా మందగించడంతో, సన్నిధానం నుంచి క్యూలైన్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. త్రాగునీరు, ఆహారం అందక, గంటల తరబడి నిల్చోవడంతో చిన్నారులు, వృద్ధులు క్యూలైన్లలోనే సొ మ్మసిల్లి పడిపోతున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు (టిడీబీ) సిబ్బందికి పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది..

ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని టిడిబీ అధ్యక్షుడు కె, జయ కుమార్ తెలిపారు.ఏర్పాట్లు సరిగా లేవని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నూతన అధ్యక్షుడు స్వయంగా అంగీకరించారు. త్రాగునీటి కేంద్రాలు, బయో-టాయి లెట్లు, ఆహార సరఫరాలో లోపాలున్నాయని ఆయన తెలిపారు. రద్దీ నియంత్రణ కు అవసరమైన కేంద్ర బలగాలైన ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ అందుబాటులో లేకపోవడం, కేటాయించిన 18,000 మంది పోలీసులకు గాను

కేవలం 3,500 మంది మాత్రమే విధుల్లో ఉండటం తో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, గత ఏడాది (2023) నాటి సంక్షోభం పునరావృతం అవుతుందని, ఎంతోమంది భక్తులు యాత్రను మధ్య లోనే విరమించుకోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *