Panchayat Election: నేడో.. రేపో.. నగారా..!
పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లపై జిల్లాల్లో గెజిట్‌ల జారీ నేడు ఎస్‌ఈసీకి అందజేయనున్న పీఆర్ హైదరాబాద్, నవంబరు 23 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందర్లోనే పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి.. ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ…

