
హబ్సిగూడ: రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుందని తన మొదటి చిత్రం షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. హీరో, విలన్ చేసే పోరాట దృశ్యాలు, ఖైదీలు కూరగాయలు కోయడం, బట్టలు ఉతికే సన్నివేశాలకు అనువుగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ ఉండటంతో షూటింగ్ చూసేందుకు జనాలు వచ్చే అవకాశం. ఉండదు. కూల్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం.. నేడు కాసులు కురిపిస్తోంది.

ఇక్కడ చిత్రీకరణ చేసిన సినిమాలు
గాడ్ ఫాదర్, భీమానాయక్, శ్రీదేవి సోడా సెంటర్, భళా తందనాన, మామా మశ్చింద్ర, మా నాన్నా సూపర్ హీరో, ఎఫ్ 3, అరబిక్ కడలి, కాంత, ఆంధ్రా కింగ్ తాలుకా, పలు లఘుచిత్రాలు. ఇక్కడ చిత్రీకరించారు.

కళాశాల అభివృద్ధికి వినియోగిస్తాం: వినయ్కుమార్, ప్రిన్సిపల్
కళాశాలలో షూటింగ్ చేసేందుకు ఒక్కరోజుకి రూ. 50వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీటీఈటీ కమిషనర్ అనుమతి మేరకు చిత్రీకరణకు అనుమతి ఇస్తాం. వచ్చే ఆదాయాన్ని కళాశాల అభివృద్ధికి ఉపయోగిస్తాం.

