పనుల స్థితి: 96% పనులు పూర్తి
సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుంది.

