MLA Korukanti Chander laid foundation for construction of Dhobighat

కులవృత్తిదారులకు భరోసాగా ముఖ్యమంత్రి కెసిఆర్: కోరుకంటి

తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల నమ్ముకుని జీవిస్తున్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా నిలుస్తు తగిన ప్రోత్సాహం అందిస్తూన్నరని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం 3వ డివిజన్లో 5 లక్షల ACDB నిధులతో ధోబి ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతం లో పాలన చేసిన ప్రజాప్రతినిధులు ఎవ్వరు ఎన్టీపీసి రజకులను పట్టించుకోలేదని తాము ఎమ్మెల్యే గా గెలిస్తే దోభిఘాట్ ఎర్పాటు చేయుస్తమని చెప్పిన విధంగా ఈ రోజు దోబిఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు.

వృత్తిని నమ్మకుని జీవిస్తున్న రజకులను అదుకోవాలని సిఎం కేసీఆర్‌ రజకులకు లాండ్రి షాపుల నిర్వహణ కోసం 250 యూనిట్ల కరెంటు ను ఉచితంగా అందిస్తున్నరని అన్నారు. దోబీ ఘాట్ లో అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పారు. దోభిఘాట్లో బోర్వెల్ నిర్మాణం కావాలనీ రజకులు కోరాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు తాము అండగా ఉంటున్నామని వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి వారి కష్టాలు తీస్తున్నామని చెప్పారు. రజకుల కులదైవం మడెలయ్య ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహాకారం అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్ వీరాలాల్ కుమ్మరి శారదా, శ్రీనివాస్ రాములు కిశోర్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.