శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు!
హైదరాబాద్:నవంబర్ 19మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో సోమ, మంగళ వారాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయిం ది, పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది.., దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శబరిమలలో రెండు నెలల పాటు జరిగే మండల- మకర విళక్కు యాత్రా సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది….

