whatsapp image 2025 11 24 at 1.13.41 pm

💥ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన..🖊️

హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన…

Read More
whatsapp image 2025 11 22 at 11.50.16 am

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

TG: మావోయిస్టుల ఎన్కౌంటర్తో అలజడి రేగుతున్న వేళ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ ఎదుట 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు అజాద్, అప్పాసి నారయణ, ఎర్రాలు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ప్రెస్మెట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించనున్నారు. కాగా ఆపరేషన్ కగార్తో పలు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.

Read More
20251122 132250

మావోయిస్టు అగ్ర నేతల లొంగుబాటు

Hyderabad: టాప్ మావోయిస్ట్ నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ తెలంగాణలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు సుమారు 20 మంది క్యాడర్‌ కూడా లొంగిపోయే అవకాశం ఉందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అతిపెద్ద వ్యవస్థీకృత లొంగుబాట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, విలేజీ రామగుండానికి చెందిన అప్పాసి నారాయణ 40 సంవత్సరాల క్రితం అడవి బాట…

Read More