950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల
వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734 పోస్ట్ లు, వైద్యవిధాన పరిషత్ పరిధిలో 209 పోస్ట్ లు, ఐపిఎమ్ లో 7పోస్ట్ లు ఉన్నాయి . మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది జూన్ లో 969 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికోసం మెుత్తం 4,803 దరఖాస్తులు వచ్చాయి. కాగా గత నెల మెరిట్ లిస్ట్ విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వాటి ఆధారంగా 950 పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఈ ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా జరిగిందని ట్వీట్ చేశారు.