మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా..
ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ మీటింగ్‌లతో పాటు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తుల్లో కూడా పాల్గొన్నట్లు తేలింది.
నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి.. కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

