By..
ఆకుల లక్ష్మణ్
కోవిడ్-19 వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక మరియు ఆరోగ్య వ్యవస్థలు తలకిందులు అయ్యాయి. ముఖ్యంగా పర్యాటక విద్య రంగాలు దారుణం గా దెబ్బతిన్నాయి . పర్యాటక రంగం పక్కన పెడితే విద్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. విద్య సంస్థలు కరోన కారణం గా తరచు ముత పడటం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. తరగది లో నేర్పాల్సిన చదువు ఆన్లైన్ క్లాస్ లు అంటూ ఫోన్ లలో చెబితే విద్యార్థులకు ఓనగురే ప్రయోజనం ఎంత అనేది ప్రశ్నర్థకమే అవుతోంది. ప్రత్యక్ష విద్య బోధన వల్ల పిల్లలకి టీచర్స్ తో నేరుగా మాట్లాడి అవసరమైన సందేహాలను నివృత్తి చేసుకుంటారు . గురు భక్తి ఉంటుంది . గౌరవ మర్యాదలు తెలుస్తాయి.
ఆన్లైన్ క్లాస్ ల వల్ల పిల్లల్లో ఇవి ఎంతవరకు అలవడుతాయి? పిల్లలు ఫోన్ లో క్లాస్సెస్ ఏ కాకుండా ఇతర వెబ్ సైట్స్ వైపు మల్లె ప్రమాదం ఉంది . ఇగ పోతే ప్రైవేట్ విద్య సంస్థల బాధలు వర్ణనాతీతం. 2020 ఫిబ్రవరి లో ముత పడ్డ స్కూళ్ళు రెండు సంవత్సరాల వ్యవధి లో ఆర్నెళ్ల పాటు కూడా ప్రత్యక్ష తరగతులు జరగలేదు. పోయిన సెప్టెంబర్ నుంచి ప్రారంభమయిన స్కూళ్ళు .. గాడిన పడ్తున్నాయ్ అనుకునే లోపు మళ్ళీ 30 వరకు సెలవుల పొడగింపుతో ఆందోళనకు గురవుతున్నాయి స్కూళ్ళ యాజమాన్యాలు . తరగతులు నడవక పోవడం తో బడ్జెట్ స్కూళ్ళ లో ఫీజుల వసూలు కావడం లేదు . దీనితో జీతాలు చెల్లించడం , అద్దె కట్టడం బస్సుల EMI లు చెల్లించడం కత్తి మీద సాము అవుతోంది అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి.
ఇప్పటికి చాలా పాఠశాలలు మూత పడ్డాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెలవుల పొడిగింపు పై పునరాలోచన చేయాలని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండంట్ లు కోరుతున్నారు. మాల్స్ ,థియేటర్లు పబ్ లు క్లబ్ లు అన్ని ఓపెన్ ఉండి ..పాఠశాల లు మాత్రమే బంద్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. అవన్నీ తెరిచి ఉంచిన రాని కరోన స్కూళ్లు మాత్రం తెరిచి ఉంచుతే నే వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు .
ఆన్లైన్ క్లాసుల వల్ల ఒరిగేది ఏమి లేదని అంతే గాకుండా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేకుంటే జరిగే నష్టం ఎవరు పూడ్చలేనిది అని వాపోతున్నారు . ఇకనైనా ప్రభుత్వం పాఠశాలలను వెంటనే తెరవాలని కోరుతున్నారు .