తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. 8, 9, 10 తరగతులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన. 50 శాతం టీచర్లు విధులకు హాజరుకావాలని ఉత్తర్వులిచ్చారు. ఇక మేలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని, సిలబస్ తగ్గించి, పరీక్ష పత్రంలో చాయిస్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.