కుష్టువ్యాధి పై అవగాహన కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా.K.ప్రమోద్ కుమార్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా PHC రాఘవాపూర్ వైద్య సిబ్బందితో కుష్ఠు వ్యాధిపై నినాదాలు, స్పర్శ్- కుష్ఠు వ్యాధి అవగాహనా ప్రచారంలో చేయవలసిన వాగ్దానం సేవలు గురించి ప్రతిజ్ఞ చేయించారు.
వ్యక్తి, కుటుంబంలో, సమాజంలో ఎవరికైనా చర్మం పై స్పర్శ కోల్పోయిన మచ్చలు వుండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కల్గించినపుడు తెలియక పోయినట్లయితే కుష్ఠు వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఉన్నట్లైతే గ్రామ స్థాయిలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలని కుష్ఠు వ్యాధిగ్రస్తులను వివక్ష చూపకుండా వారి ఆత్మగౌరవం కాపాడాలని మహాత్మాగాంధీ కలలు గన్న విధంగా భవిష్యత్తులో కుష్ఠు వ్యాధి రహిత జిల్లా నిర్మాణంలో చేయి చేయి కలిపి ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, ఉద్యోగులు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా.K.ప్రమోద్ కుమార్ గారు, డా.మమత, DPMOs జయకర్, ప్రకాష్ రావు, MPHEOs రాజేష్, సాంబ్బయ్య, సూపెర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.