ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీలలో ఉదయ్ కిరణ్ కు బ్రాంజ్ మెడల్
కానిస్టేబుల్ ఉదయ్ కిరణ్ ని అభినందించిన రామగుండం సీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
రామగుండం పోలిస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఉదయ్ కిరణ్ సెప్టెంబర్ 19వ తేదీ నుండి 24 వ తేదీ వరకు న్యూఢిల్లీలో, సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడవ ఆల్ ఇండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించారు.
ఆల్ ఇండియా ఛాంపియన్ షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ ఉదయ్ కిరణ్ ను రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఈరోజు సీపీ గారి కార్యాలయం లో అభినందించారు. ఆటలు కేవలం దేహ దారుఢ్యానికే కాకుండా, ఆరోగ్యం, మానసికోల్లాసానికి కూడా దోహదపడతాయని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ, పోలీసుల క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటామని సీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎసిపి సారంగపాణి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, సిఐ ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.