పెద్దపల్లి లో వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
పెద్దపల్లిజిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్(ఎల్లమ్మ గుండమ్మచెరువు) పై గణనాథుల యొక్క నిమజ్జనం ఏర్పాట్లను గురువారం రోజున మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించి, అధికారులకు పలుసూచనలను తెలిపారు.ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పోలీసు శాఖ,విద్యుత్ శాఖ వారి సమన్వయంతో అన్ని పనులను పర్యవేక్షిస్తున్నామని రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చాడం,చెట్ల కొమ్మలు తొలిగించడాం జరుగుతుందని గణపతులను తీసుకవచ్చే సమయంలో ట్రాక్టర్ లపై పిల్లలను కూర్చోపెట్టి తీసుకరవద్దని కరెంట్ తీగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రతి సంవత్సరంలాగే నిమజ్జనం కొరకు ఎన్ టి పి సి వారి నుండి భారీ క్రేన్లను తేపిస్తున్నామని ప్రజలందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గణపతులను నిమజ్జనం చేసుకోవాలని కోరారు.
ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు,కో అప్షన్ సభ్యులు కమిషనర్ తిరుపతి, మేనేజర్ శివప్రసాద్ ఎం ఎ ఈ సతీష్,సానిటరీ ఇన్స్పెక్టర్లు సంధ్యారాణి,రామ్మోహన్,వర్క్ ఇన్స్పెక్టర్లు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.