అపరి శుభ్రతకు నిలయంగా రాయదండి గ్రామం
800 ఏండ్ల ఘనమైన చరిత్ర కల శివాలయం ఉన్న గ్రామం రాయదండి. ఇప్పుడు ఈ గ్రామం అపరిశుభ్రతకు నిలయంగా మారి విషజ్వరాలకు అడ్డాగా మారింది. రాయదండి గ్రామంలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు ఉన్నాయి, కానీ రాయదండి పోచమ్మ దేవాలయం నుండి శివాలయం, పోరండ్ల మల్లేశం పొలం చివరి వరకు గల రోడ్డుకు ఇరుప్రక్కల కొంత మంది బహిరంగ మలవిసర్జనకు వినియోగిస్తున్నారు. అత్యంత పవిత్రమైన శివాలయం పరిసర ప్రాంతాలు పూర్తిగా బహిరంగ మలవిసర్జనకు నిలయంగా మారింది. దాంతో పోచమ్మ దేవాలయం, శివాలయం వచ్చే భక్తులు, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ కారణం చేత గ్రామంలో విషజ్వరాలు ప్రబలి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వెంటనే పాలకులు మేల్కొని గ్రమంలో బహిరంగ మలవిసర్జనను నిషేధిస్తూ తీర్మానం చేసిన, దానిని అతిక్రమించిన వారికి 2000 రూపాయలు జరిమాన విధించి ప్రజలను రోగాల బారినుండి రక్షించబడం తో పాటు గ్రామాన్ని పరిశుభ్రతకు నిలయంగా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.
కునారపు రమేష్ (KR)
రాయదండి గ్రామ నివాసి