ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ నెల 22న ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకంపై అవగాహన: పరిశ్రమల శాఖ జి.ఎం. ఎస్. మధుసుధన చారి
పెద్దపల్లి: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నవంబర్ 22న ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎస్. మధుసుధన చారి తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం క్రింద తయారీ, సేవా రంగ పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ల పైన అవగాహన కల్పించనున్నామని, 18 సంవత్సరాల నిండిన ఉత్సాహవంతులైన యువకులు, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి గలవారు, స్వచ్ఛంద సంస్థలు, స్వశక్తి మహిళా సంఘాలు, సొసైటీ రిజిస్ట్రేషన్ క్రింద రిజిస్టర్ అయిన సంస్థలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి కల్పన పథకాల కింద ఇదివరకు లబ్ధి పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలులేదని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా లాభాలు, దరఖాస్తు విధానం, ఇది వరకు ప్రారంభించిన వ్యాపార వివరాలు వివరించేందుకు, యువతకు అవగాహన కల్పించేందుకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జి.ఎం. పేర్కొన్నారు.