దసరా పండుగ బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలి
గొడవలకు దారి తీస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు: ఎన్టీపీసీ ఎస్.ఐ.జీవన్
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండగలను ప్రశాంత, స్నేహపూరిత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఎన్టీపీసీ ఎస్ ఐ జీవన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ… కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సంతోషగా అందరితో కలసి మెలసి పందుగులను జరుపుకోవాలని ఎన్టిపిసి ఎస్ఐ పత్రికా ప్రకటనలో కోరారు.
అదేవిధంగా బతుకమ్మ, జమ్మిపూజలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని అన్నారు. దసరా రోజు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో దసరా జరుపుకోవాలని అలా కాకుండా గొడవలకు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావునా ప్రజలు, ప్రజాసంక్షేమం కోసం మంచి ఉద్దేశ్యంతో పోలీసులకు సహకరించాలని ఎస్.ఐ కోరారు.
అదే విధంగా ఈరోజు బతుకమ్మ ఆట ఆడుతున్న క్రమంలో మహిళలు వారి నగలను, ఆభరణాలను, విలువైన వస్తువులను జాగ్రత్త గా ఉంచుకోవాలని సూచించారు.