Pushpa: ‘పుష్ప’ చిత్రం కథ, పంచ్ డైలాగ్ లపై గరికపాటి ఆగ్రహం
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన ఆయనకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
“సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయని, సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉండటం లేదని అన్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’పై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. స్మగ్లర్ని హీరోగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు.
‘‘ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి.. చివరి ఐదు నిమిషాల్లో మంచి చూపిస్తాం, తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. స్మగ్లింగ్ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా? ఇప్పుడు అదొక సూక్తి అయిపోయింది. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘తగ్గేదే లే’ అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ గరికపాటి వ్యాఖ్యానించారు.