భారతీయ జనతా యువ మోర్చ రామగుండం కార్పోరేషన్ ఉపాధ్యక్షులుగా పసునూటి శ్రావణ్ కుమార్
భారతీయ జనతా యువ మోర్చ రామగుండం కార్పోరేషన్ ఉపాధ్యక్షులుగా పసునూటి శ్రావణ్ కుమార్ ను నియమించినట్లు యువ మోర్చ కార్పోరేషన్ అధ్యక్షులు కాంపెళ్లి రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ , ప్రధాన కార్యదర్శులు తడిగొండ నర్సయ్య, పల్లికొండ నర్సింగ్, కార్యదర్శి గుర్రాల సందీప్ కు ఇంకా ఈ నియామకానికి కృషి చేసిన తోటి కార్యకర్తలకు శ్రావణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.