Ramagundam: Sammakka Sarakka jatara

సమ్మక్క, సారలమ్మ జాతర కి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ ‌కెమెరాలతో నిరంతరం నిఘా

భక్తులు జాగ్రత్తలు పాటించాలి–పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

సమ్మక్క, సారలమ్మ జాతర కొరకు బందోబస్త్ ఏర్పాట్ల పై సోమవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, పరిశీలించి సిబ్బందికి ప్రజలకు తగు సూచనలు జారీ చేసారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరుకుళ్ల సమ్మక్క, సారలమ్మ జాతర దృష్ట్యా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా జాతర సందర్బంగా ఇద్దరు సీఐ లు, నలుగురు ఎస్ ఐ లు, పన్నెండు మంది ఏఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ లు , ఎనభై మంది కానిస్టేబుల్ లు , పదిహేను మంది మహిళ సిబ్బంది, నలభై మంది హోం గార్డ్స్, స్పెషల్ పార్టీ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జాతర ప్రాంగణంలో,సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, క్రైమ్ జరగకుండా మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.


భక్తులు, పోలీసులు చెప్పే జాగ్రత్తలు సూచనలు పాటించాలని కోరారు.


1.జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. స్వీయ రక్షణ పాటించాలి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకొని కోవిడ్ నియమాలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు.


2.క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకి రావద్దు అన్నారు.


3.భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వచ్చిన వాహనాలు తిరిగి వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది.


4. టూ విలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాల పై వచ్చే వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ కోసం వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, అట్టి ప్రదేశ్లలో మాత్రమే పార్కింగ్ చేయాలి. రంగంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు పార్కింగ్-01 ప్లేస్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

  1. విఐపి పార్కింగ్ జాతర సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. నీరుకుళ్ల గ్రామపంచాయతీ నుండి వచ్చే వాహనాలు రైల్వేలైన్ దాటిన తర్వాత ఉన్న పార్కింగ్-02 ప్రదేశంలో పార్క్ చేయాలి.
  2. రోడ్ పైన వాహనాలను పెడితే అట్టి వాహనమును టోయింగ్ వాహనం తో పోలీస్ స్టేషన్ తరలించి సీజ్ చేయబడును.
  3. వాహనమును నడిపే వ్యక్తి మధ్యం సేవించి నడిపితే అట్టి వాహనమును సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయబడును.
  4. నడవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి,వృద్దులకు, వికలాంగుల కోసం గుట్టపైకి వెళ్లడం కోసం ఆటో లకు పాస్ లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది.
  5. రెండు పోలీస్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.
  6. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే
    డయల్100కు లేదా ఎస్ఐ సుల్తానాబాద్ఉపేందర్ 9440795152, సీఐ సుల్తానాబాద్, ఇంద్రసేన రెడ్డి 9440795124, పెద్దపల్లి ఏసీపీ, సారంగపాణి 9400795166, లకు ఫోన్ చేయవచ్చు. పోలీస్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
  7. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించ వద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు, అని అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.
  8. భక్తులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జాతరని ఆనందించాలి ఏసీపీ అన్నారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా వన్ వే ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ తో సీఐ సుల్తానాబాద్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ ఐ ఉపేందర్, కమిటీ చైర్మన్ వీరయ్య, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ విజేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు..