ఆరోగ్య సిబ్బందికి చీరలు పంపిణీ చేసిన రామగుండం లయన్స్ క్లబ్
కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రజలందరూ భయంతో ఇంటికే పరిమితం అయిన సమయంలో మేమున్నామంటూ ధైర్యంగా ముందుకు సాగుతూ ఆరోగ్య వైద్య సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ సామాజిక సేవే పరమావధిగా వేలాది మంది ప్రజలను కాపాడే ఆదర్శంగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ వారియర్స్ ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరముందని రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడిశేట్టి గంగాధర్ అన్నారు.
శనివారం లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళ సిబ్బందికి రామగుండం లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వసంతోత్సవాల్లో భాగంగా మాజీ గవర్నర్ లయన్ తపాడియా సతీమణి కాంతా దేవి జ్ఞాపకార్థం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్ కె లక్ష్మారెడ్డి ఆరోగ్య సిబ్బందికి పారితోషికం అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మనోజ్ కుమార్ అగర్వాల్, సభ్యులు ఆంజనేయులు ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు పారిజాతం, తిరుపతి తో పాటు అధిక సంఖ్యలో సిబ్బంది పాల్గోన్నారు.