ప్రభుత్వం రెడ్డి కార్పోరేషన్ ప్రకటించాలి
ఘట్కేసర్ రెడ్డి సంఘం సర్వ సభ్య సమావేశంలో సభ్యులందరు ఏకగ్రీవ తీర్మానం
ఈ రోజు ఘట్కేసర్ రెడ్డి సంఘం భవనంలో సర్వ సభ్య సమావేశం జరిగింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సందర్బంగ అద్యక్షుడు కొంతం రాంరెడ్డి జెండావిష్కరణ చేసిన అనంతరం, రెడ్డి కార్పోరేషన్ కొరకు పోరాడుతున్న రాష్ట్ర రెడ్డి సంఘాల కార్యవర్గమునకు మద్దతుగా సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మానిఫెస్టోలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటించలెదని, ఈ విషయంపై పలు దఫాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ, ప్రభుత్వం స్పందించడంలేదని, రెడ్డి కార్పోరేషన్ ఎర్పాటుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై కూడ వత్తిడి తీసుకొచ్చి కార్పోరేషన్ ఎర్పాటు చేసే దిశగా పనిచేయాలని కోరుకుంటూ… ఈ సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ రెడ్డి సంఘం ముఖ్య సలహాదారులు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మారం లక్మారెడ్డి, అద్యక్షులు కొంతం రాంరెడ్డి, కోమ్మిడి రాఘవ రెడ్డి, కొమ్మిడి శషికాంత్ రెడ్డి , ప్రదాన కార్యదర్శి చందుపట్ల వెంకట్ రెడ్డి , గడీల సంజీవ రెడ్డి , పన్నాల శ్రీనువాస్ రెడ్డి , కొమ్మిడి రాజేశ్వర్ రెడ్డి , చింతల మహిపాల్ రెడ్డి , భగవంత్ రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి , కోఆపరెటివ్ బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి , కట్టా జనార్దన్ రెడ్డి , కంభం లక్మారెడ్డి , గడీల రాంచంద్రారెడ్డి , కొమ్మిడి మహిపాల్ రెడ్డి, ఇంకా సంఘ సభ్యులు పాల్గొన్నారు.