రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్ లిమిటెడ్ ఆవరణలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్ లిమిటెడ్ ఆవరణలో కరోనా జాగ్రత్తలతో ఘనంగా నిర్వహించారు.
ఆర్ ఎఫ్ సి ఎల్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ విజయ్ కుమార్ భంగర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. సంస్థ అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జెండా వందనం చేశారు. శ్రీ చైతన్య పాఠశాల కు చెందిన విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా సంస్థలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, కార్మికులకు కమెండబెల్ అవార్డ్స్ ప్రధానం చేశారు. శ్రీ విజయ్ కుమార్ భంగర్ మాట్లాడుతూ… సంస్థ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.