యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ప్రజలకు… తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు
ముదోల్ నియోజకవర్గ బీజేపీ నేత గౌరవనీయులుభోస్లే మోహన్ రావు పటేల్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమయ్యారని అన్నారు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం అని అన్నారు.
‘మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుండి పుట్టింది తెలంగాణ రాష్ట్రం. బీజేపీ పార్టీ, ప్రజల వాణిని విని తెలంగాణ కలను సాకారం చేసేందుకు నిస్వార్థంగా పనిచేసినందుకు గర్విస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు ఇదే సమయంలో రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. గత 8 ఎళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలనను చవిచూసిందని విమర్శించారు. ‘‘#TelanganaFormationDay నాడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు & సామాన్య ప్రజలకు శ్రేయస్సు తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి బీజేపీ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.