గుజ్జుల నర్సయ్య మరణం పట్ల ప్రముఖుల సంతాపం

కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్, ఏబీవీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, బీహార్ యూనివర్సిటీ కోర్ట్ మెంబర్ శ్రీ గుజ్జుల నర్సయ్య గారు.. కొద్దిసేపటి క్రితం స్వర్గస్తులైనారు. వీరి స్వస్థలం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామం.

నర్సయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఎన్నో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని యువ‌త‌కు హిత‌బోధ చేశారు. గ‌తంలోనూ ఉపాధ్యాయుల ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇటీవ‌ల వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రానికి వ‌చ్చిన‌ అస్సాం ముఖ్య‌మంత్రి డా. హిమంత బిస్వ శ‌ర్మ వీరి సేవ‌ల‌ను గుర్తించి పాదాల‌కు న‌మస్క‌రించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాప సందేశం

“జీవితాంతం మహోన్నతమైన జాతీయవాద భావాలతో ప్రయాణం సాగించి, ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపిన ABVP పూర్వ ప్రాంత అధ్యక్షులు శ్రీ గుజ్జుల నరసయ్య గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.ఈ కష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను”.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ న‌ర్స‌య్య గారి శిశ్యుడు కావ‌డం గ‌మ‌నార్హం. గ్రామ అభివృద్ధి నిస్వార్థంగా సేవ చేశారు. అనేక మంది పేద‌ విద్యార్థుల‌కు అండ‌గా నిలిచారు. వివిధ విద్యా సంస్థ‌ల్లో త‌క్కువ ఫీజుల‌కే చ‌దువుకునేలా చేశారు.

ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంతాప సందేశం

ప్రముఖ విద్యావేత్త, ఎబివిపి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు శ్రీ గుజ్జుల నర్సయ్య సార్ మరణం దిగ్భ్రాంతికరం. విద్యార్థుల్లో జాతీయవాద భావజాలాన్ని నింపుతూ, పరివార కార్యకర్తలకు అండగా నిలిచే వారి మృతి జాతీయవాదులకు తీరని లోటు. నిరంతరం జాతీయ వాద వ్యాప్తి కొరకు ఆహారహారం శ్రమించారు.