రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి మాధవి లత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ…. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని కోరారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు చాలా అవసరమని, చెట్లను కట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీనరి పెంచాలని కోరారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధవి లత ఛాలెంజ్ విసిరారు.