ఘట్కేసర్ గురుకుల్ అవరణలో శ్రీ దేవీ నవరాత్రులు ఉత్సవాలు

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల్ అవరణంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని శ్రీశ్రీశ్రీ దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి తెలిపారు.

“గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాల సందడి లేదని, ఈ ఏడాది దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించి, మళ్ళీ పండుగ వాతావరణం కల్పిస్తామని”, ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

అలాగే, ఈసారి మా అధ్వర్యంలో.. గురుకుల ఆవరణలో వేడుకలు జరగడం సంతోషంగా ఉందని, తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఆ దేవి మాత, ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరారు.