రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్రమైన మ్యాప్ అట్లాస్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
సోమవారం మంత్రుల నివాసంలో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముద్రించిన ఈ మ్యాప్ ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించింది.
రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని ఆయన అన్నారు.
ప్రజలు, అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతో ఉపయోగకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.