పొగాకు నుంచి విముక్తితోనే ఆరోగ్య ముక్తి
పొగాకు నుంచి దేశానికి, పొగాకు ఉత్పత్తుల నుంచి దేహానికి విముక్తి కలిగినపుడే అసలు సిసలైన ఆరోగ్య స్వతంత్రం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్, అంతర్జాతీయ స్థాయిలో “పొగాకు నియంత్రణ లెజెండ్” అవార్డు గ్రహిత మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఆదివారం ఖైరతాబాద్ కూడలిలో జరిగిన పొగాకు నియంత్రణ ఆవశ్యకత కార్యక్రమానికి రఘునందన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా “మాచన” మాట్లాడుతూ.. 2008 నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు ప్రతి ఏటా అక్టోబర్ 2 న గాంధీ జయంతి తో పాటే సార్వజనిక ప్రదేశాల పొగాకు రహిత చట్టం (కోట్పా ) అమలు దినోత్సవం ను జరుపు కుంటున్నామని తెలిపారు. ఆరోగ్యం పై పెట్టే శ్రద్ద లో భాగంగా.. పొగాకు పై పోరుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. హోమియో వైద్యులు, ప్లానెటరీ హెల్త్ & హ్యుమన్ డెవలపమెంట్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ చెరకుల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. 2008లో పార్ల మెంటు సభ్యులు గా ఉన్న డాక్టర్ అన్బుమణి రాందాస్ చొరవ వల్లే ప్రతి ఏటా గాంధీ జయంతి ని పురస్కరించుకుని దేశాన్ని కూడా పొగాకు చెర నుంచి విముక్తి కలిగించాలనీ, అందుకు బహిరంగ ప్రదేశాలలో పొగాకు ఉత్త్పత్తుల వాడకం పై నిషేధం అమలు లో ఉండాలి అని చట్టం చేశారని చెప్పారు.
హోమియో వైద్యులు రామగుండం సాయి కృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్స కంటే నివారణ గొప్పది అని అన్నారు. ఖైరతబాద్ కూడలి లో ధూమపానం వద్దు ఆన్న అవగాహన కోసం రోడ్డు పై జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పేయింటింగ్ వేశారు. బహిరంగ ప్రదేశాలలో పొగాకు నియంత్రణ, ధూమపాన నిషేదం అవసరం చాటుతూ.. కోట్పా చట్టం పై అందరికీ అవగాహన కలిగేలా వేసిన రోడ్ పేయింటింగ్ వాహన దారులను ఆకట్టు కుంది. మమత తదితరులు పేర్కొన్నారు.