వినాయక నిమగ్నం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
సుల్తానాబాద్ : వినాయక నిమగ్నం ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ పోలిస్ ఇతర శాఖల అధికారుల తో కలిసి మంగళవారం పరిశీలించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎస్సై ఉపేందర్ రావులతో కలిసి స్థానిక చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఆయా ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను చేస్తున్నారని అందులో భాగంగా స్థానిక పెద్ద చెరువులో నిమగ్నం చేసేందుకు చెరువు వద్ద లైట్లు తో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెరువులో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని ఉత్సవ కమిటీలు తమ వాహనాలను చెరువు వద్దకు తీసుకువచ్చిన అనంతరం వారికి అప్పగించి చెరువుగట్టు నుండి సుగులాంపల్లి మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
శాంతియుతంగా సామరస్యంగా ర్యాలీలను కొనసాగించాలని వీలైనంత త్వరగా నిమజ్జనం చేపట్టాలని అన్నారు పరిసరాలను స్థానిక మున్సిపల్ సిబ్బందిచే శుభ్రపరిచి చెరువులో వేసేందుకు చర్యలు తీసుకున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కోరార