Ganesh Immersion

శోభా యాత్రలో డిజెలకు అనుమతి లేదు, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు

నిమజ్జన ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలి

ప్రశాంత వాతవరణం లో నిమజ్జన శోభయాత్ర కొనసాగాలి : సీఐ ఇంద్రాసేన రెడ్డి

గణేష్ నిమజ్జన శోభయత్ర నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ సమితి, మత పెద్దలు,రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.*ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ* నిబంధనలను పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్ర జరుపుకోవాలని అన్నారు. వినాయక ఉత్సవాలలో, శోభయాత్ర లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుగాని, ఘర్షణలు గాని జరుగకుండా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు.

👉 సోషల్ మీడియా లో వచ్చే పుకార్లు నమ్మవద్దు అని, ఏ చిన్న సమస్య ఉన్న పోలీస్ వారికి తెలియ చేస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

👉అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, స్థానిక పోలీస్ అధికరులకు కాల్ చేయాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.👉గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు.

👉 ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని సూచించారు.

👉నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని, నిర్దేశించిన విదంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

👉 శోభా యాత్రలో డిజెలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు పాటించకపోయినా, శోభా యాత్రలో డి.జె.లు వాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

👉ముఖ్యంగా శోభాయాత్ర సమయంలో విద్యుత్ తీగలు విగ్రహాలకు తగలకుండా చూసుకోవాలని, ఇనుప విద్యుత్ స్థంబాలు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

👉నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా మండపాల నిర్వహకులంతా పోలీసుల సూచనలు పాటించాలని, వారికి కేటాయించిన నెంబర్ల ప్రకారం విగ్రహాలను తరలించేలా చూసుకోవాలన్నారు.

👉 ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలకు కేటాయించిన నెంబర్ల ప్రకారం, సమయాన్ని విధిగా పాటిస్తూ నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని కోరారు.

👉నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన ఊరేగింపులో ఎట్టి పరిస్థితుల్లోనూ డి.జె.లను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.

👉శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

👉వినాయక నవరాత్రులు, నిమజ్జనం ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన విధంగా జరుపుకోవాలని వారు సూచించారు.

👉నిమజ్జన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా శాంతోషంగా సంబరాలు జరుపుకోవాలని సీఐ గారు అన్నారు.ఈ సమావేశం లో సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్, మున్సిపల్ కమీషనర్, ఎంఆర్‌ఓ , ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్, ఏఈ, మత పెద్దలు, మండపాల నిర్వహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.