లంచం లేనిదే ఏ పని ముట్టని ఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం లేనిదే పనులు జరగని వైనం. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే పేద ప్రజలు ఎక్కువగా వస్తుంటారు, కానీ లంచాలకు అలవాటు పడిన సిబ్బంది, వైద్యుల వలన పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రి నుండి జారీ చేసే ప్రతీ పత్రానికి ఒక రేటు నిర్ణయించి మెడికల్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ల వంటి వాటికి పరీక్షల మాట అటుంచితే కనీసం వ్యక్తిని చూడ కుండా డబ్బు ఇచ్చిన వారికి ధ్రువ పత్రాలు జారీ చేస్తున్నారని, ప్రజలు వాపోతున్నారు. ఎందుకు జారీ చేస్తున్నాం అనే కనీస ఆలోచన కూడా లేకుండా లంచం ఇస్తే ఏ పని అయిన జరుగుతుంది అన్నచందంగా తయారైందని, ఇక్కడ సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బందిని వైద్యుల తరుపున లంచాలు వసూలు చేయడానికి నియమించుకున్నారని, లంచాలు లేనిదే వైద్యులు పెన్ను కదపడం లేదని, సంతకాలకు స్టాంపులకు లంచాలు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై ఆధారాలతో సహా ఆసుపత్రి సూపరిండెంట్ గారిని కలిసి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగిందని, పసునూటి శంతన్ కుమార్ తెలిపారు.