Ramagundam: Street lights, police patroling need of the hour

ప్రమాదాలకు, తాగుబోతులకు అడ్డాగా మారిన రాయదండి- పెద్దంపేట రోడ్డు

అంతర్గ్రామం మండలం రాయదండి గ్రామ పోచమ్మ దేవాలయం నుండి పెద్దంపేట గ్రామం వరకు ఉన్న కచ్చా రోడ్డును ఇరు గ్రామాలతో పాటు విలేజీ రామగుండం, పాములపేట, లింగపురం, విద్యుత్ నగర్, శుభాష్ నగర్ లకు చెందిన రైతులు, లింగాపూర్ ఓ.సి.పి కార్మికులు, సామాన్య ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే వీధిలైట్లు లేకపోవడంతో, ఈ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా మూల మలుపుల వల్ల ఎదురుగా వచ్చే జంతువులను, మనుషులను గుర్తించకపోవడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిల పాలయ్యారు.

ఇదే రోడ్డులో ఉన్న రాయదండ గ్రామ శివాలయానికి దాదాపు 800 ఏళ్ళ ఘన చరిత్ర ఉంది, అలాంటి ఆలయంలో ఇదివరకే దొంగలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆలయం ముందు సీసీ కెమెరాల లేకపోవడంతో దొంగల భయం ఉంది. పోలీస్ పహారా లేకపోవడంతో, ఇదే దారిలో ఉన్న పెద్దంపేట కాలువ వంతెన.. ప్రతీ రోజు సాయంత్రం తాగుబోతులకు అడ్డాగా మారింది. అటుగా వెళ్ళాలంటేనే మహిళలు రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు, దీనిపైన పోలీసువారు దృష్టి పెట్టాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు తీరాలంటే తక్షణమే రామగుండం ఎం ఎల్ ఏ కోరుకంటి చందర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టాలని, యువరైతు కునారపు రమేష్ తెలిపారు.

# రాయదండి గ్రామ పోచమ్మ దేవాలయం నుండి పెద్దంపేట గ్రామం వరకు తక్షణమే వీధి లైట్లు ఏర్పాటు చేయాలి.

# రాయదండి గ్రామ పోచమ్మ దేవాలయం నుండి పెద్దంపేట వరకు సీసీ కెమెరాల పెట్టించాలి

# ఈ దారిలో తాగుబోతుల ఆగడాలను అరికట్టడానికి పోలీసు పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయాలి.