రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఆగస్టు -2022 లో PC 2773 సత్యనారాయణ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. తన తోటి 2000 ఉమ్మడి ఆదిలాబాద్ బ్యాచ్ కానిస్టేబుళ్లు కలిసి రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సమక్షంలో అవునూరి సత్యనారాయణ భార్య స్వప్న కుటుంబ సభ్యులకు రెండు లక్షల (రూ. 2,00,000) నగదును అందజేశారు. అవునూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన తోటి 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.
మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి మిగతా బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన తోటి 2000 బ్యాచ్ మిత్రులు పెంచాలా వెంకటేష్, శ్రీను, బుద్దె రవి, మండల్ శ్రీను, రాజు, వామన్, శివన్న, సుధాకర్, అవునూరి సత్యనారాయణ కుటుంబం తదితరులు పాల్గొన్నారు.