పెద్దపల్లి పట్టణంలో అర్వింద్ ధర్మపురి పుట్టినరోజు వేడుకలు
పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పుట్టినరోజు సందర్భంగా.. అర్వింద్ అభిమాని, బీజేపీ యువ నాయకుడు ఉప్పు కిరణ్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో, ఉదయం ఆల్ఫాహారం తయారీకి సంబంధించిన వస్తువులను, పండ్లు, సబ్బులను అందించారు.
అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని చిన్నారులకు ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వైద్యనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కిరణ్ తెలిపారు.
రానున్న రోజుల్లో అర్వింద్ గారు.. మంచి పదవులు, పొందాలని, అలాగే చాలా మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్, మహేష్, వెంకటేష్, సాయి, చందు, రాజు, హరీష్, కార్తీక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.