Peddaplly Collectorate opening

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న లక్ష మందితో భారీ బహిరంగ సభ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించే సభాస్థలిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సీఎం సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామాన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎంఎల్సి భాను ప్రసాద్ రావు, కలెక్టర్ సంగీత, సీపీ సత్యనారాయణ, డీసీపీలు రూపేష్, అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్, ఏసిపి సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.