రాజ్ పథ్ రిపబ్లిక్ డే వేడుకలలో ప్రదర్శనకు సుధీర్ కలంకారీ హ్యాండ్ పెయింటింగ్
సంప్రదాయం , చరిత్రలో సంపన్నమైన భారతదేశ వైవిధ్యభరితమైన జానపద కళారూపాలు శతాబ్దాలుగా ఉత్తేజకరమైన దృశ్య ప్రాతినిధ్యం ద్వారా ఎన్నో కథలను వివరించాయి . వాటిలో ప్రతిఒక్కటి సాంస్కృతికంగా ప్రముఖమైనదే. పంజాబ్ లోని రాజ్ పురా చిట్కారా విశ్వవిద్యాలయం లోని కళాకుంభ్ లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న ఇటువంటి కొన్ని సంప్రదాయ రాబోయే గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్ లో ప్రదర్శించ నున్నారు.
రాజ్ పథ్ లోని ఒక ఓపెన్ గ్యాలరీలో, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్ జిఎంఎ) భారీ స్క్రోల్స్ ను ప్రదర్శిస్తుంది, వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు. భారతదేశం అంతటా ఉన్న 500 మందికి పైగా కళాకారులు దీనిని చిత్రించారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి కి చెందిన ఆర్టిస్ట్ సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్ పై ఉంటుంది.
కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ పై చేసే చేతి పెయింటింగ్ యొక్క పురాతన శైలి. కలంకారీ అనే పదం ఒక పర్షియన్ పదం నుండి ఉద్భవించింది, ఇక్కడ ‘ కలం ‘ అంటే కలం ‘కరి’ కళాత్మకతను సూచిస్తుంది.ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలు ఉంటాయి.
కలంకారీలో గీసిన మోటిఫ్ లు పువ్వులు, నెమలి ,పైస్లీల మొదలు మహాభారతం , రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి.ఈ రోజుల్లో, ఈ కళ ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. శ్రీ సుధీర్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్ లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ (బివిఎ) పూర్తి చేశాడు.