రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB)ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) ల నిర్మాణం కోసం ₹404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ₹404.82 కోట్ల రూపాయల్లో ₹250.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా ₹154.80 కోట్లు రైల్వేశాఖ భరిస్తుందని తెలిపారు.

1.చటాన్ పల్లి-షాద్ నగర్

2.ఆదిలాబాద్ మార్కెట్ యార్డు

3.పెద్దపల్లి టౌన్

4.మాధవనగర్,నిజామాబాద్