Who is responsible?

సజీవదహనం..

సజీవదహనం..ఓ భర్త.. ఓ భార్య.. ఓ ప్రియుడు.. అన్నెపున్నెం తెలియని ఓ వివాహిత.. నాలుగేళ్లు కూడా నిండని ఇద్దరు ఆడబిడ్డలు.. ఆరు ప్రాణాలు అగ్నికి ఆహుతి.. తల్లిపొత్తిల్లలో ఉండాల్సిన చిన్నారుల దేహాలుబిడ్డలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన తల్లి దేహం.. భగభగమండే నిప్పుల్లో కాలిబూడిదై మాంసం ముద్దలుగా మారింది.

అసలు ఎవరిదీ పాపం..

భర్త ఉండగానే మరో మొగాడితో సహజీవనం చేసిన భార్య మాసు పద్మదా.. భార్య పరాయి మగాడితో గడుపుతున్నా చూసి చూడనట్టుగా గడిపిన భర్త మాసు శివయ్యదా.. భార్య పిల్లలను వదిలేసి.. శారీరక సుఖం కోసం ప్రియురాలి ఇంట్లో నే కాపురం పెట్టిన శనిగారపు శాంతయ్య దా.. భర్త చనిపోయి తల్లిదండ్రులు లేక ఒంటరై.. ఇద్దరు పిల్లలతో ఓ తోడు కోసం పిన్ని ఇంటికి వచ్చి కాలానికి బలైన గడ్డం మౌనికదా..?

కాలి బూడిదైంది దేహాలు మాత్రమే కాదు మానవత్వం.. ఆరుగురి అగ్నికి ఆహుతైనా గుడిపల్లిలో బాదిత కుటుంబ సభ్యుల కంటి నుండి కన్నీటి చుక్క రాలలేదు.. కల్లెదుటే తల్లిదండ్రులు మాసు పద్మ , శివయ్యల దేహాలు మాంసం ముద్దలుగా పడి ఉన్నా కొడుకు సందీప్ కించిత్ కూడా మనసు శోకించింది లేదు. అయ్యో పాపం చిన్నారులు అన్నాలంగా బలయ్యారే అన్న ఆవేదన తప్ప‌ఊర్లో ఆ నలుగురిపై కించిత్ కూడా జాలి లేదు. కారణం.. అక్రమ‌బందం.. సంబందం.. కాటికి పంపిన కారణం కూడా అదే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామపంచాయితి మారుమూల గ్రామం గుడిపల్లి ఘటన సమాజానికి నేర్పుతున్న ఓ గుణపాఠం కూడా..

జర్నలిస్ట్ Facebook నుండి