వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ మేఘనకు శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

ఆమె మరిన్ని విజయాలు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించిన ఎంపీ రవిచంద్ర

వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బంగారు పతకం సాధించిన సాధుల మేఘనకు, ఆమె తల్లీదండ్రులు శ్రీలత, సారంగపాణి (ACP) రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

జర్మనీలో జరిగిన పోటీలలో ఆమె విశేష ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని గెల్చుకుని భారతదేశ పేరు ప్రఖ్యాతలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పడం హర్షనీయమన్నారు. మేఘన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికి గర్వకారణమని, భవిష్యత్తులో మేఘన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షిస్తూ తన ఆశీస్సులు అందజేశారు.