రామాయణ స్ఫూర్తితోనే భారతదేశం ముందుకెళ్తోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఐసీసీఆర్ ఆధ్వర్యంలో ‘6వ అంతర్జాతీయ రామాయణ్ మహోత్సవ్’
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, రామమందిర నిర్మాణం శతాబ్దాలుగా భారతీయుల కలగా తీరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామాయణంతో సంబంధమున్న ప్రాంతాలను రైలు మార్గం ద్వారా కలిపే రామాయణ సర్క్యూట్ కు మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. భారతదేశానికి మాత్రమే కాకుండా మన పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్, తూర్పు పసిఫిక్ దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియాతోపాటుగా పసిఫిక్ దేశమైన ఫిజీ, కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాలకు కూడా రాముడు, రామాయణం స్ఫూర్తిదాయకమేనని.. ఆయా దేశాల్లో ఇప్పటికీ రామాయణానికి విశేషమైన ఆదరణ ఉందన్నారు.ఈ సందర్భంగా భారత్, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో కు చెందిన కళాకారులు ప్రదర్శించిన రామాయణ కళారూపాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఐసీసీఆర్ ప్రెసిడెంట్ శ్రీ వినయ్ సహస్రబుద్ధే, వివిధ దేశాల అంబాసిడర్స్ తదితరులు పాల్గొన్నారు.