📰 నకిలీ పత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రయత్నం విఫలం… తాహేబ్ మహ్మద్ పట్టివేత
చేవెళ్ల గ్రామీణం, న్యూస్‌టుడే:
రూ.కోటి విలువైన ప్లాట్‌ను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన సోమవారం చేవెళ్లలో వెలుగుచూసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు మోసాన్ని గుర్తించి నిందితులను పోలీసులకు అప్పగించారు.
సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన శర్మ 2006లో మొయినాబాద్ ప్రాంతంలో ‘భరద్వాజ్ వెంచర్’ పేరిట ప్లాట్లు విక్రయించారు. అదే సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన అనిల్ దూబే తన భార్య అమృత పేరిట 300 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నం.235ను కొనుగోలు చేశారు.
ఇటీవల నగరానికి చెందిన తాహేబ్ మహ్మద్ ఆ ప్లాట్‌కు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాడు. సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన సందర్భంగా యజమాని అమృత పేరును పిలిచారు. అయితే, అక్కడికి వచ్చిన ‘మున్నాబాయ్’ అనే మహిళ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది.
దీంతో పత్రాలను పూర్తిగా పరిశీలించి ఆన్‌లైన్ రికార్డులతో సరిపోల్చగా అవి నకిలీ అని తేలింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న తాహేబ్ మహ్మద్ పారిపోవడానికి యత్నించగా కార్యాలయ సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అతనితో పాటు వచ్చిన మహిళలు మరియు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
