హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ
హైదరాబాద్, జూలై 9: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఆయా శాఖలకు సంబంధించిన వివిధ ఫైళ్ల ప్రస్తుత స్థితిని మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి కొండా సురేఖకు వివరించి, వాటిపై త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, శాఖల పరిధిలో అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అటవీ, దేవాదాయ శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.
