మియాపూర్లో అత్యాధునిక వసతులతో సుప్రజ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు
మియాపూర్: సుప్రజ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను మియాపూర్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు, వైద్య రంగ ప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శిగ విజయ్తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, వివేకానంద, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.
అలాగే హాస్పిటల్ సిబ్బంది లోకేష్ గౌడ్, ప్రభాకర్, గురువయ్య, కుమారస్వామి, నరేష్, నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మియాపూర్లో కొత్త బ్రాంచ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు ఆధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
