అగ్రీ గ్రీన్ ఫామ్స్ & శ్యామ్ టెక్ కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రోన్ సేవలను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అగ్రీ గ్రీన్ ఫామ్స్ పౌల్ట్రీస్ & హాచరీస్ “పల్లె బ్రదర్స్” రైతులకు అందిస్తున్న సేవల విస్తరణలో భాగంగా నూతనంగా అత్యాధునిక డ్రోన్ సేవలను అంతర్గాo మండలం పెద్దంపేట గ్రామంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలు వాడటం వల్ల రైతులకు శ్రమ తగ్గడం తోపాటు తక్కువ సమయంలోనె అధిక ఆదాయ సంపాదించడానికి ఉపయోగకరంగా ఉంటుందని.. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులందరు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. అత్యాధునిక డ్రోన్ నిర్వాహకులు “పల్లె బ్రదర్స్” ఐన పల్లె సతీష్ పటేల్, పల్లె రాజు పటేల్ , పల్లె శ్యామ్ సుందర్ పటేల్ లను కలెక్టర్ ఈ సంధర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, పెద్దపల్లి SBI ఏ సి బి బ్యాంకు చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ మూర్తి, స్థానిక తాహసిల్దార్ పనగంట రాంమోహన్ రావు, స్థానిక ఎం పి డి ఓ భూక్య యాదగిరి నాయక్, స్థానిక వ్యవసాయ శాఖ అధికారి రాం బాబు, గ్రామ పెద్దలు ఇంకా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.