ఇలర్న్‌మార్కెట్స్ ఫేస్2ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు మొదటి ఎడిషన్‌ విజయవంతం

లైవ్ ట్రేడింగ్‌లో పాల్గొన్న 262 మంది ట్రేడర్లు

ముంబై: ఆర్థిక అవగాహనా వేదిక ఇలర్న్‌మార్కెట్స్, ఫిన్‌టెక్ యాప్ స్టాక్ఎడ్జ్ తో పాటుగా, 2022 ఏప్రిల్ 26 నుండి 29 వరకు గోవాలో ఫేస్2ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు మొదటి ఎడిషన్‌ని విజయవంతంగా నిర్వహించింది. నిపుణులతో పాటు , ట్రేడర్లు పాల్గొని లావాదేవీలు నిర్వహించుకొని మంచి లాభాలను చేసుకున్న లైవ్ ట్రేడింగ్ సెషన్లు జరిగాయి. సెషన్ల సందర్భంగా వారు తెలుసుకున్న పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి చూశారు.

ఈ 3-రోజుల మెగా ట్రేడింగ్ సదస్సుకు హాజరైన వారికి అందులో అనేక అభ్యసన సెషన్లు జరిగాయి. స్టాక్ఎడ్జ్ కూడా తన యాప్ నుండి లావాదేవీలతో సహా అత్యాధునికమైన అనేక ఫీచర్లను ప్రారంభించింది. ఇప్పుడు స్టాక్ఎడ్జ్ వాడుకదారులు అందరూ యాప్ నుండే నేరుగా తమ సంబంధిత జీరోధా, కోటక్ సెక్యూరిటీస్, గ్రో మరియు మరెందరో బ్రోకర్లతో ఆర్డరు చేయగలుగుతారు.

ఈ సదస్సులో ప్రముఖ ట్రేడర్ అసిత్ బరన్ పాటి విభిన్న ట్రేడింగ్ సూచికల సహాయముతో కొనుగోలు వ్యూహాల ఆప్షన్లపై ఒక సెషన్ నిర్వహించారు. విశాల్ మల్కాన్ సాంకేతిక పోకడలను ఉపయోగించి స్వల్ప-కాలిక ట్రేడింగ్ పైన చిట్కాలను తెలియజేశారు. వివేక్ బజాజ్ , ప్రమల్ పారేఖ్ కూడా సాపేక్ష శక్తిని ఉపయోగించి స్వింగ్ ట్రేడింగ్ వ్యూహాలపై చర్చించారు.

ప్రసిద్ధ ఆప్షన్స్ స్కాల్పర్ శివకుమార్ జయచంద్రన్ గారు, 2-క్యాండిల్ సిద్ధాంతమును ఉపయోగించి ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎలా డబ్బు చేసుకోవాలో పాల్గొన్నవారికి ప్రదర్శించి చూపారు. మార్కెట్ నిర్మాణము గురించి పాల్గొన్నవారికి అవగాహన కల్పించడానికి సుప్రసిద్ధ ప్రముఖవ్యక్తి పియూష్ చౌధరీ గారు బహుళ-అసెట్ ట్రేడింగ్ పైన ఒక సెషన్ తీసుకున్నారు. కునాల్ సరోగీ వాల్యూము భ్రాంతులతో ట్రేడింగ్ గురించి శిక్షణ ఇచ్చారు.

సదస్సు ఆఖరి రోజున లైవ్ ట్రేడింగ్ సెషన్ క్రింద, విజయ్ థాకరే, శివకుమార్ జయచంద్రన్, అసిత్ బరన్ పాటి, చేతన్ పంచామియా, విశాల్ మల్కాన్, కునాల్ సరోగీ గారలు, గత రెండు రోజులలో హాజరైన వారు తాము తెలుసుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టడానికి గాను వారికి ఒక వేదికను అందించారు.

“ఆర్థిక అక్షరాస్యత అనేది ఇండియాలో అతి తక్కువగా ఉంటూ వస్తోంది, మా వినియోగదారు ఆర్థిక మదుపును ముందుకు తీసుకువెళ్ళడానికి గాను వారిని మార్కెట్ పోకడలతో నైపుణ్యం పొందేలా చేయడమనేది ప్రారంభం నుండీ కూడా మా ధ్యేయముగా ఉంది. ఇందులో పాల్గొన్నవారి భాగస్వామ్యము మరియు వారు తెలుసుకున్న తీరును చూడడం పట్ల మేము నిజంగా ఎంతగానో ఆనందిస్తున్నామని, స్టాక్ఎడ్జ్ మరియు ఇలర్న్‌మార్కెట్స్ సహ-వ్యవస్థాపకులు శ్రీ వివేక్ బజాజ్ తెలిపారు. స్టాక్ఎడ్జ్ వద్ద ట్రేడ్ ఫీచరును ప్రారంభించడానికి ఈ సదస్సు ఒక సరైన వేదికగా మేము భావిస్తున్నాము. ప్రత్యక్ష మార్కెట్ల సందర్భంగా ట్రేడింగ్ చేయడం అనేది పాల్గొన్న వ్యక్తి పొజిషన్ సైజింగ్, సైకాలజీ, మరియు రిస్క్ యాజమాన్యం విషయంగా నిర్వహణకు వారికి దిశానిర్దేశం చేసింది. ఈ విజయంతో, మదుపరులను సిద్ధం చేయడానికి గాను వారికి నైపుణ్యాలను అందించడానికై అట్టి ఆఫ్‌లైన్ మరియు లైన్ ఈవెంట్లను తీసుకురావడానికి మేము మరింతగా నిబద్ధులై ఉన్నాము”