కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం
నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ లో (Naraina Industrial Area) రాజ్య సభ ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మియావాకీ పద్దతిలో వెయ్యి మొక్కలు నాటి మినీ ఫారెస్ట్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభివృద్ధి చేస్తోంది.
ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జయరామ్ రమేష్, సంజయ్ సింగ్ (ఆప్), బినోయ్ విశ్వం.(సీపీఐ) అనిల్ దేశాయ్ (శివ సేన), ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, జి.రంజిత్ రెడ్డి, మన్నేశ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కెఆర్, సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, పీ. రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు.