కరాటే పోటీల్లో కాంస్యం సాధించిన కునారపు శ్రీహర్ష
రామగుండం: అంతర్గాo మండలం రాయదండి గ్రామానికి చెందిన కునారపు సరిత, రమేష్ (KR) దంపతుల కుమారుడు శ్రీహర్ష , భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలో ‘విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా’ ఇటీవల నిర్వహించిన మొదటి ఓపెన్ సౌత్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ –2022, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు.
కరాటే పోటీలు కఠినంగా ఉంటాయని, ఎదుటి వ్యక్తితో పోరాడాల్సి ఉంటుందని, అందుకు చాలా రోజులు కఠినమైన సాధనతో పాటు, మానసికంగా దృఢంగా ఉండాలని, మా గురువు వడ్డేపల్లి సూరేష్ మాస్టర్ ప్రతీ నిత్యం నాకు మేలకువలు నేర్పించారని శ్రీహర్ష ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
చిన్నప్పటి నుండి శ్రీహర్షలో ఉన్న ఉత్సాహాన్ని, దైర్యాన్ని, పట్టుదలను గమనించిన శ్రీహర్ష తల్లిదండ్రులు, శ్రీహర్షకు శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగా తమ కుమారుడు కరాటే పోటీల్లో పథకం గెలుచుకోవడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, తమ ఊరుకి గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.